మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అరెస్ట్‌

72చూసినవారు
మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అరెస్ట్‌
తెలంగాణలో ప్రతిపక్ష నేతల ఫోన్‌‌ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు అరెస్ట్‌ అయ్యారు. మంగళవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలో పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్​లో స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన అనంతరం బుధవారం ఉదయం నాంపల్లి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :