గుండెపోటుతో నాలుగవ తరగతి చిన్నారి మృతి చెందిన విషాద ఘటన గురువారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో చోటు చేసుకుంది. రోటిగూడ గ్రామానికి చెందిన దిగుట్ల సమన్విత(10) ఉదయం స్కూల్ కు వెళ్లేందుకు రెడీ అవుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గుర్తించిన తండ్రి నాగరాజు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. గుండెపోటుతో బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధృవికరించారు. దీంతో కన్నోళ్లు గుండెలు పగిలేలా రోధించారు.