ఊహాగానాలతో వార్తలు రాస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలలో గందరగోళం సృష్టించవద్దని సోమవారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హెచ్చరించారు. తాజాగా ఎంపీ అరుణకు బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తున్నారని వాట్సాప్, సోషల్ మీడియా గ్రూపుల్లో కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.