మహబూబ్ నగర్: ఉరేసుకుని డిగ్రీ విద్యార్థిని సూసైడ్
ఉరి వేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జడ్చర్ల నియోజకవర్గం లో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. నవాబుపేట మండలం కాకర్లపహాడ్ లో జరిగింది. గ్రామానికి చెందిన అంకిత(18) మహబూబ్ నగర్ లో డిగ్రీ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు ఆలయంలో పని చేస్తుంటారు. కాగా, ఆదివారం వారు గుడికి వెళ్లి తిరిగి వచ్చే వరకు అంకిత ఇంట్లో ఉరేసుకుంది. ఆమె ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.