దసరా పండుగ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ ప్రేమ్ నగర్ లో మహిళలకు ఎంపీ డీకే అరుణ చీరలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎంపి అరుణ మాట్లాడుతూ. కౌన్సిలర్ కిషోర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయం అన్నారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయం అన్నారు. దసరా పండుగను ప్రజలంతా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కాంక్షించారు.