
మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల బీఎస్పీ ముఖ్య నేతల సమావేశం
బహుజన సమాజ్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు శుక్రవారం మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇబ్రహీం శేఖర్ హాజరై పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఆర్థికంగా సామాజికంగా ఎదిగి ఇతరులకు సహాయపడాలని, సమాజంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలను రాజ్యాంగ బద్ధంగా ప్రశ్నించాలన్నారు.