సాంస్కృతిక సారథి చైర్మన్ గా నియమితులైన డాక్టర్ వెన్నెల సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర మరువలేనిదని తెలిపారు. సాంస్కృతిక శాఖ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.