తెలంగాణ ప్రభుత్వం రైతాంగ వ్యవస్థను పటిష్టపరచడానికి, వ్యవసాయ అభివృద్ధికి, పంటరుణాల మాఫీని ఒక అత్యవసర పెట్టుబడిగా గుర్తించి రైతులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతుల పంట రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, అర్హులైన ప్రతి రైతు అకౌంట్లో నేరుగా ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ డబ్బులు జమ చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బ్యాంకర్లను ఆదేశించారు.