అయోధ్య శ్రీరాముడి దర్శనానికి శనివారం నారాయణపేట మున్సిపల్ కౌన్సిలర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరి వెళ్లారు. మొదట ఆనంతసేన స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వాహనంలో బయలుదేరి వెళ్లారు. ఇటీవల అయోధ్యలో ప్రతిష్ఠాపన చేసిన బాల రాముడిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నట్లు కౌన్సిలర్లు తెలిపారు. వెళ్లిన వారిలో శిరీష, అనిత, మేఘా, రాజేశ్వరి, బీఆర్ఎస్ నాయకులు చెన్నారెడ్డి, శివరాం రెడ్డి, సుభాష్ వున్నారు.