ఘనంగా జిహ్వేశ్వర స్వామి జయంతి వేడుకలు

84చూసినవారు
ఘనంగా జిహ్వేశ్వర స్వామి జయంతి వేడుకలు
నారాయణపేట పట్టణంలోని మర్గమ్మ దేవాలయంలో శనివారం జిహ్వేశ్వర స్వామి జయంతి వేడుకలు స్వకుళ శాలి సమాజం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వామివారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం యజ్ఞం నిర్వహించి పల్లకి సేవ చేశారు. మహిళలు డోలాహరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సమాజం పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you