విద్యాశాఖ మంత్రిని నియమించాలి: ఎస్ఎఫ్ఐ

82చూసినవారు
విద్యాశాఖ మంత్రిని నియమించాలి: ఎస్ఎఫ్ఐ
రాష్ట్రంలో విద్యా రంగ అభివృద్ధి కోసం విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డి. కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ వనపర్తి జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. విద్యారంగ సమస్యలపై విద్యార్థి సంఘాలతో ముఖ్యమంత్రి చర్చించాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఎ జిల్లా కార్యదర్శి ఆది, కమిటీ సభ్యులు మొగిలి, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్