కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు

1281చూసినవారు
కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు
వనపర్తి జిల్లా మదనాపూర్ మండలంలోని దంతనూరు గ్రామంలో సోమవారం ఉదయం సీ. ఎస్. హెల్త్ కేర్ వారి ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల కు 54రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల భవననిర్మాణ సంఘము అధ్యక్షుడు వెంకటయ్య మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వం భవననిర్మాణ సంఘము కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తుందని వాటిని కార్మికులు వినియోగించుకోవలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రావణి, పిఏసీఎస్ వైస్ ఛైర్మన్ చీర్ల శ్రీనివాసులు, మండల టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, జమ్ములు, గ్రామ భవననిర్మాణ కార్మిక సంఘము అధ్యక్షుడు నరేందర్, సీ. ఎస్. సీ హెల్త్ కేర్ జిల్లా కోఆర్డినేటర్ నరేష్, క్యాంప్ కోఆర్డినేటర్ భాస్కర్ మరియు పెద్దఎత్తున భవననిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :