వనపర్తి కలెక్టరేట్ ముందు ఐఎఫ్టియూ ధర్నా

79చూసినవారు
వనపర్తి కలెక్టరేట్ ముందు ఐఎఫ్టియూ ధర్నా
గత 8 నెలలుగా పెండింగ్ లో ఉన్న గ్రామపంచాయతీ వర్కర్స్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల గ్రామ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వనపర్తి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు రాజు, కురుమయ్య, గణేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వర్కర్స్ పై సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తుందన్నారు. ప్రత్యేక నిధులు విడుదల చేసి సిబ్బందికి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.