వనపర్తి: శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి కురుమూర్తి స్వామివారు పద్మావతి సమేతంగా శేష వాహనంపై ఊరేగారు. మంగళవాయిద్యాల మధ్య పల్లకిసేవ కొనసాగింది. ప్రధాన ఆలయం నుంచి మోకాళ్ల గుండు వరకు స్వామివారు విహరించారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఏడుకొండలు మారుమోగాయి.