కర్నూలు జిల్లా ఆలూరు మండలం కురువల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున బీడీ కాల్చేందుకు స్టవ్ వెలిగించడంతో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను బళ్లారిలోని ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ వెలిగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.