బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) పరిశోధకులు రక్తంలో షుగర్ స్థాయిని కొలవడానికి సూది స్థానంలో ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నారు. చర్మానికి కోతపెట్టాల్సిన అవసరం లేకుండానే, కాంతి సాయంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కొలిచే ఫొటో అకౌస్టిక్ పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు ఉపయోగించారు. కణజాలంలో గ్లూకోజ్ తీవ్రతను మాత్రమే కొలిచేలా తీర్చిదిద్దడం గమనార్హం. ఇందుకు, పోలరైజ్డ్ కాంతిని వాడారు.