వారి త్యాగాలను స్మరించుకుందాం: ప్రధాని మోడీ

83చూసినవారు
వారి త్యాగాలను స్మరించుకుందాం: ప్రధాని మోడీ
విప్లవ స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల త్యాగాలను స్మరించుకుందామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం మార్చి 23, 1931న లాహోర్ జైలులో వారిని ఉరితీసింది. ఈ సందర్భంగా వారి త్యాగాలను గుర్తు చేస్తూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ‘ఈ రోజు మన దేశం వారి అత్యున్నత త్యాగాలను స్మరించుకుంటుంది. స్వేచ్ఛ, న్యాయం కోసం వారు నిర్భయంగా చేసిన కృషి మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంది’ మోడీ అన్నారు.

సంబంధిత పోస్ట్