AP: తూ.గో. జిల్లా భిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో రెండో రోజు ఇంటింటి సర్వే కొనసాగుతుంది. క్యాన్సర్ కేసుల నమోదు విషయంలో ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదని వైద్యాధికారులు చెబుతున్నారు. బలభద్రాపురంలో 23 క్యాన్సర్ కేసులను వైద్యాధికారులు గుర్తించారు. ఈ మేరకు గ్రామస్థులకు అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం హోమిబాబా బృందం గ్రామంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేపట్టనున్నారు.