వాళ్లను కూడా జైలుకు పంపుతాం: సీఎం రేవంత్
అల్లు అర్జున్ అరెస్ట్‌ను నిరసిస్తూ అభిమానులు చేస్తోన్న ఆందోళనలపై ఢిల్లీలో జరిగిన 'ఆజ్ తక్' చర్చా వేదికగా సీఎం రేవంత్ స్పందిచారు. "ఎవరి కోసమైనా నిరసనలు జరుగుతాయి. 10-20 మంది గుమికూడినంత మాత్రాన అది నిరసన అయిపోదు. అనుమతి లేకుండా ఎవరు నిరసన చేసినా వాళ్లనూ జైలుకు పంపిస్తాం. తొక్కిసలాటలో పేద మహిళ చనిపోతే, ఆమె గురించి మాట్లాడకుండా ఘటనకు కారణమైన వ్యక్తిపై చర్చ ఏంటి?" అని సీఎం ప్రశ్నించారు.