కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో టమోటా ధరలు కిలో రూ.1కి పడిపోయాయి. ఈ క్రమంలో కష్టించి పండించిన పంటలకు కనీస ధర దొరకలేదనే ఆవేదనతో కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేయడంపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. కిలో టమాటను మార్కెటింగ్ శాఖ రూ.8కి కొనాలని ఆదేశాలిచ్చారు. టమాటా కిలో రూ. 8కి కొని అదే ధరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో విక్రయించాలని స్పష్టం చేశారు.