చిన్న పక్షితో స్నేహం కోసం గొరిల్లా ప్రయత్నం (వీడియో)

1532చూసినవారు
ఓ గొరిల్లా ఓ చిన్న పక్షితో ఎంతో స్నేహపూర్వకంగా ప్రవర్తించిన వీడియో వైరల్ అవుతోంది. కెనడాలోని కాల్గరీ జూలో గొరిల్లా వద్దకు ఓ చిన్న పక్షి వెళ్లింది. ఆ పక్షితో గొరిల్లా ఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరించింది. దానిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. అది నడవడానికి అడ్డు లేకుండా గడ్డిని పక్కకు తొలగించింది. ఆ పక్షికి ఎటువంటి హానీ తలపెట్టకుండా ప్రవర్తించింది. మధ్య మధ్యలో తన తల గోక్కుంటూ విచిత్రంగా ప్రవర్తించింది.