ప్రముఖ గాయకుడు దిల్జిత్ దోశాంజ్ హైదరాబాద్‌లో నిర్వహించనున్న మ్యూజిక్ కచేరీపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. శుక్రవారం రాత్రి నిర్వహించే లైవ్ షోలో మద్యం, డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా ఎలాంటి పాటలు పాడకూడదని.. వేదికపై పిల్లలు పాల్గొనకూడదని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. కాగా గతంలో ఢిల్లీలోని జరిగిన షోలో మద్యం, డ్రగ్స్, హింసను ప్రొత్సహించే పాటలను దిల్జిత్ పాడారని రుజువైంది. దీంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.