1999 ‘తమ్ముడు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అదితి గోవిత్రికర్. ఆ తర్వాత కేవలం ఒక్క తెలుగు మూవీతోనే సరి పెట్టుకుంది. మళ్లీ ఇప్పుడు తిరుమలలో ప్రత్యక్షమైంది. శుక్రవారం శ్రీవారి దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 17 ఏళ్ల తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. ముంబైకి చెందిన ఈమె హిందీ, మరాఠీ సినిమాల్లో నటించింది. ‘తమ్ముడు’ హీరోయిన్ ఎంతలా మారిపోయిందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.