ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లలో జరిగిన అవకతవకలపై విచారణ కమిటీని నియమించింది. ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని నియమించి 2019-24 మధ్య టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల జాబితా మార్చివేత ఆరోపణలపై విచారణ చేయాల్సిందిగా ఆదేశించింది. 2019-24లో టిడ్కో ఇళ్ల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై విచారణ చేయిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలోనూ ప్రకటన చేశారు.