నవ్యాంధ్ర సాహిత్యానికి వేగుచుక్క గురజాడ

81చూసినవారు
నవ్యాంధ్ర సాహిత్యానికి వేగుచుక్క గురజాడ
రాజభవనాల గోడల్లో వేలాడుతున్న కవితా కన్యకను భుజాన ఎత్తుకొని జనం దగ్గరకు తెచ్చిన మహాకవి గురజాడ. అంధ విశ్వాసాలపై సాహిత్యాన్ని పాశుపతాస్త్రంగా ప్రయోగించిన ఆయన గిడుగును స్ఫూర్తిగా తీసుకొని వ్యవహారిక భాషకు పెద్దపీట వేశారు. మనిషి చేసిన రాయిరప్పకు, మహిమ కలదని సాగి మొక్కుతు మనిషి అంటే రాయిరప్పల కన్న కనిష్టంగా చూస్తావేమి బాలా... అనీ, దేశమంటే మట్టికాదోయ్, దేశమం టే మనుషులోయ్... అనీ ఎలుగెత్తారు. మంచి అన్నది మాల అయితే మాలనే నగుదున్.. అంటూ వర్ణవ్యవస్థపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్