AP: రెండు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే విశాఖ స్టీల్ ప్లాంట్ను సీఎం చంద్రబాబు చౌకగా అమ్మే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకున్నామని.. చంద్రబాబు చేతులెత్తేశారని దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. త్వరలోనే ఉత్తరాంధ్రలో సమస్యలపై పోరాటం చేస్తామని వెల్లడించారు.