గూఢచారిని కాదని 4 సార్లు నిరూపించుకోవాల్సి వచ్చింది: ప్రపంచ దేశాలన్నీ చూసిన US యాత్రికుడు

61చూసినవారు
గూఢచారిని కాదని 4 సార్లు నిరూపించుకోవాల్సి వచ్చింది: ప్రపంచ దేశాలన్నీ చూసిన US యాత్రికుడు
విదేశాల్లో పర్యటించేటప్పుడు తనని గూఢచారి అనుకోని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారని ప్రపంచంలోని ప్రతి దేశాన్ని సందర్శించిన అమెరికన్ యాత్రికుడు ఇండి నెల్సన్ చెప్పారు. ఈ క్రమంలో గూఢచారిని కాదని 4 సార్లు నిరూపించుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇరాన్, లిబియా, పపువా న్యూ గినియా, రష్యాలలో ఈ అనుభవం ఎదురైందని, 24 గంటల పాటు నిర్బంధంలో ఉంచి ప్రశ్నించినట్లు ఆయన తెలిపారు. కాగా, 'అత్యధిక విమానయాన సంస్థలలో ప్రయాణించిన వ్యక్తి'గా నెల్సన్ గిన్నిస్ వరల్డ్ రికార్డును కలిగి ఉన్నాడు.

సంబంధిత పోస్ట్