
మిర్చి రైతులకు చేయూత.. త్వరలో గుడ్న్యూస్!
దేశంలోని మిర్చి రైతులకు చేయూత విషయంలో కేంద్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా శుక్రవారం ఉదయం 11గంటలకు భేటీ కానున్నారు. మిర్చి రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మద్దతు ధర విషయంపై అధికారులు చర్చించలు జరపనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితుల గురించి కూటమి ప్రభుత్వ ప్రతిపాదనపై, ఏపీ నుంచి మిర్చి ఎగుమతికి ఉన్న మార్గాలపై కూడా అధికారులు చర్చించనున్నట్లు తెలుస్తోంది.