యూపీలోని ఫతేపూర్‌లో గురువారం తెల్లవారుజామున షాకింగ్ ఘటన జరిగింది. ఓ హోటల్ ముందు ఆగి ఉన్న బస్సును వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. మహాకుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ చనిపోయింది. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.