వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. "జగన్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి గుంటూరు మిర్చియార్డుకు వెళ్లారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.. రావొద్దని పోలీసులు చెప్పినా జగన్ వినలేదు. ఈసీ నిబంధనలు పాటించకుండా మరో వైపు భద్రత కల్పించాలని కోరడం కరెక్ట్ కాదు. ప్రజా సమస్యలపై స్పందించేందుకు వివిధ వేదికలు ఉన్నాయి" అని అన్నారు.