తమిళనాడులోని కృష్ణగిరిలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి రాత్రి వేళ రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పటికే అక్కడ ఉన్న ముగ్గురు దొంగలు ఆయనపై దాడి చేశారు. రాయితో కొట్టడంతో రోడ్డుపై బాధితుడు పడిపోయాడు. అనంతరం ఆ ముగ్గురు దోపిడీకి పాల్పడి, అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దోపిడీకి పాల్పడిన ముగ్గురూ మైనర్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.