ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అర్థశతకం సాధించాడు. 69 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో శుభ్‌మన్ గిల్ 50 పరుగులు చేశాడు. రోహిత్ (41), విరాట్ కోహ్లీ (22), శ్రేయాస్ అయ్యర్ (15) పరుగులకు పెవిలియన్ చేరారు. దీంతో భారత్ 27.4 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో గిల్, అక్షర్ ఉన్నారు.