

VIDEO: కాలర్లు పట్టుకొని ఘోరంగా కొట్టుకున్న బీజేపీ నేతలు
రాజస్థాన్లోని జైపూర్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేతలు జావేద్ ఖురేషి, జాకీ ఒకరి కాలర్లు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు. దీంతో ఒకరి చొక్కా కాలర్లు మరొకరు పట్టుకొని కొట్టుకున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎదురుగానే ఒకరిపై మరోకరు చెంప దెబ్బలతో వాయించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. వారు ఇతర నేతలు, కార్యకర్తల ముందే ఫైట్ చేసుకోవడం కలకలం రేపింది.