తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం నిర్వహణపై గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 4న ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’గా పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణను ఫిబ్రవరి 4న ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాలకు గుర్తుగా సామాజిక న్యాయ దినోత్సవం జరపాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.