ఏపీలో అంతర్యుద్ధం రాబోతోందని వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదన్నారు. విజయవాడ పోలీసుల ఇచ్చిన నోటీసు తాను తీసుకున్నట్లు ఆయన తెలిపారు. న్యాయ నిపుణుల సలహా తీసుకుని విచారణకు పూర్తిగా సహకరిస్తానని గోరంట్ల మాధవ్ వెల్లడించారు. త్వరలో విచారణ తేదీని మార్చమని కోరతానని ఆయన అన్నారు.