ఏపీలో YCP నేతల అరెస్టులు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. మొన్న వల్లభనేని వంశీ, నిన్న పోసాని కృష్ణమురళి అరెస్ట్ కావడంతో నెక్ట్స్ ఎవరనేది చర్చగా మారింది. నెక్ట్స్ మాజీ మంత్రి రోజానే లక్ష్యంగా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు చర్చ నడుస్తోంది. రోజా మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్రాలో భారీ స్కామ్ జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇదే ఉచ్చు రోజాకు బిగుసుకోవడం ఖాయమని వార్తలు వస్తున్నాయి.