సిద్ధిపేట జిల్లాలో అదృశ్యమైన మహిళ హత్యకు గురైంది. వర్గల్(M) అనంతగిరిపల్లికి చెందిన యాదమ్మ(40) భర్త చనిపోయాడు. అదే గ్రామానికి చెందిన చిన్న లక్ష్మయ్యతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెట్టడంతో ఈనెల 15న కోమటిబండ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి కల్లులో పురుగు మందు కలిపి తాగించాడు. అనంతరం చీరతో ఉరేసి చంపాడు. నిందితుడిని రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.