
BREAKING: ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి గాయాలు
AP: విజయవాడలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీడా పోటీల్లో ఇద్దరు MLAలు, ఓ MLC గాయపడ్డారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కబడ్డీ ఆడుతూ వెనక్కి పడిపోవటంతో తలకు గాయమైంది. మరోవైపు రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ కూడా కబడ్డీలో కిందపడడంతో ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది. అలాగే క్రికెట్ ఆడుతూ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి కింద పడిపోయారు. వీరందరినీ సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.