కేంద్ర ప్రభుత్వం పాడి రైతులకు శుభవార్త చెప్పింది. దేశంలో పాల ఉత్పత్తిని, దేశీయ పశువుల జాతుల ఉత్పాదకతను పెంచడానికి రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద రూ.3,400 కోట్ల నిధులను కేటాయించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా మరి కొన్ని నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.