25 మంది వైసీపీ నాయకులపై కేసులు నమోదు

72చూసినవారు
AP: మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ అమలు చేయాలంటూ వైసీపీ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. వైసీపీ తిరుపతి ఇన్చార్జి భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో బస్సులో చంద్రబాబు హామీ ఇచ్చిన వీడియోతో నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఆర్టీసీ బస్సు ఎక్కి కండక్టర్‌ విధులకు ఆటంకం కలిగించారు. దీంతో 25 మంది వైసీపీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నగరపాలక మేయర్‌, వైసీపీ నియోజకవర్గ బాధ్యులు అభినయ్‌పై కూడా కేసులు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్