

నిజమే.. నెల క్రితం గాయపడ్డా: నటి అన్షు (వీడియో)
తన నుదుటిపై గాయం నిజమైందేనని నటి అన్షు చెప్పారు. 'మజాకా' సినిమా ప్రమోషన్స్ టైంలో అన్షు తలకు బ్యాండేజీతో కనిపించగా ఏం జరిగిందా అని అంతా చర్చించుకున్నారు. దీనిపై తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె స్పందించారు. నెల క్రితం గాయపడ్డానని, కుట్లు కూడా వేశారని పేర్కొన్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వల్ల కోలుకున్నానని తెలిపారు. 'మజాకా' మూవీ ఆశించినంతగా ఆడకపోవడంతో ఈ మన్మథుడు ఫేమ్ తిరిగి లండన్‌కు వెళ్లారు.