ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కాంగ్రెస్ నేత కీలక భేటీ ముగిసింది. తెలంగాణ నేతలతో నిర్వహించిన ఈ సమావేశం సుమారు గంటన్నర పాటు జరిగింది. ఈ భేటీకి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీటింగ్‌లో పాల్గొన్నారు.