ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో తెలంగాణ నేతల భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణకు పార్టీ అగ్రనేతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నాలుగు మంత్రి పదవులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబందించిన ప్రకటన ఉగాది రోజున వెలువడే అవకాశముంది. దీంతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు భర్తీ చేసే ఛాన్స్ ఉంది.