AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సంచలన ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కన్నా, జగన్ మద్యం కుంభకోణం చాలా పెద్దదని లోక్ సభలో ఎంపీ కృష్ణదేవరాయలు తెలిపారు. లిక్కర్ ఉత్పత్తికి ముందే స్కాం చేసిన ఘనత జగన్ దని విమర్శించారు. ఓ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో జగన్ తన బంధువు సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్‌కు రూ. 2వేల కోట్లు తరలించారని ఆరోపించారు.