వింత ఆచారం పాటించి యువనటి కన్నుమూత
మెక్సికన్ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ మార్సెలా అల్కాజర్ రోడ్రిగ్జ్ వింత ఆచారం పాటించి మృతి చెందారు. ఓ పానీయంలో 'కాంబో' అని పిలువబడే అమెజోనియన్ జెయింట్ కప్ప విషాన్ని కలుపుకొని ఆహారంగా తినడం ఆనాదిగా వస్తున్న మెక్సికన్ ఆచారం. అయితే ఈ ఆచారానికి సంబంధించిన పండుగలో పాల్గొన్న రోడ్రిగ్జ్.. ఆ పానీయాన్నితీసుకొని అస్వస్థతకు గురైంది. ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయింది.