టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవిని గురువారం ‘పుష్ప-2’ టీమ్ కలిసింది. పుష్ప-2 మూవీ ఘనంగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న వేళ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు రవిశంకర్, నవీన్ యెర్నేని, సీఈఓ చెర్రీ, చిత్ర దర్శకుడు సుకుమార్ చిరంజీవి నివాసానికి వెళ్లి మెగాస్టార్ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన విశేషాలను చిరు అడిగి తెలుసుకున్నారు.