TG: ‘పుష్ప 2’ సినిమా వేయలేదని సినిమా థియేటర్‌పై దాడి చేసిన ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. చెన్నూరు మండల కేంద్రంలోని శ్రీనివాస థియేటర్‌లో గురువారం ఉదయం పుష్ప 2 సినిమా వేయలేదని థియేటర్‌పై అభిమానులు రాళ్లతో దాడిచేశారు. దీంతో థియేటర్ ప్రొప్రైటర్ కుర్మా రాజమల్ల గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులపై గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.