నేటి నుంచి ఒంటిపూట బడులు.. వద్దని హరీశ్ రావు డిమాండ్

84చూసినవారు
నేటి నుంచి ఒంటిపూట బడులు.. వద్దని హరీశ్ రావు డిమాండ్
కులగణన నుంచి ప్రభుత్వ స్కూళ్ల టీచర్లను మినహాయించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. వారి సేవలను ఇలా వినియోగించుకోవడం విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు. సర్వే కోసం స్కూళ్లను మధ్యాహ్నం వరకే నడపడం సరికాదన్నారు. అకస్మాత్తుగా ఒంటిపూట బడులు నడపడం వల్ల పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ఇబ్బందులు ఉంటాయన్నారు. కాగా, సర్వే నేపథ్యంలో ప్రైమరీ స్కూల్స్ నేటి నుంచి సర్వే ముగిసే వరకు ఉ.9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పని చేయనున్నాయి.

సంబంధిత పోస్ట్