AP: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాట వల్ల భక్తులు ఎవరూ చనిపోలేదని చెప్పారు. 'దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం నుంచి తిండి లేకుండా క్యూలో నిలబడి ఆత్రుతతో పరిగెత్తారు. శరీరంలో షుగర్ లెవల్స్ తగ్గి వాళ్లంతట వాళ్లే కింద పడి చనిపోయారు. తోపులాట జరగలేదు. ఇందులో TTD వైఫల్యం లేనే లేదు. టీటీడీ అధికారుల పనితీరు బాగుంది. వారిని అభినందిస్తున్నా' అని ఆయన అన్నారు.