తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటన ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు ఎలాగైనా దక్కించుకోవాలన్నా కొందరి తొందరపాటు ఆరుగురి ప్రాణాలను తీసింది. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. ఈ విషాద ఘటన తిరుమల చరిత్రలో చేదు జ్ఞాపకంగా నిలిచిపోయింది.